హైదరాబాద్: 28°C
వ్యాపారం

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు రెండు రోజుల తర్వాత భారీగా పెరిగి షాకిచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,330 పెరిగి రూ.1,55,350కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,050 పెరిగి రూ.1,42,400 ఉంది. అటు కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.