హైదరాబాద్: 28°C
వ్యాపారం

SBI ఏటీఎం విత్‌డ్రా రూల్స్‌లో మార్పులు

శాలరీ అకౌంట్ హోల్డర్ల నెలవారీ ATM విత్‌డ్రా రూల్స్‌లో SBI మార్పులు చేసింది. ఇతర బ్యాంకుల ATMలలో జరిపే ఉచిత లావాదేవీల సంఖ్యను సగానికి తగ్గించింది. గతంలో నెలకు 10 ఫ్రీ ట్రాన్సాక్షన్లు ఉండగా, 5కు కుదించింది. లిమిట్ దాటిన ప్రతి లావాదేవీపై రూ.23(+GST) ఛార్జీ విధించనుంది. నాన్-క్యాష్ ట్రాన్సాక్షన్స్‌పై రూ.11(+GST) విధించనుంది. OCT 1 నుంచి అమల్లోకి రానున్నాయి.