హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సముద్ర కోతతో జగన్నాథుని ఆలయానికి ముప్పు

కాకినాడ: కొత్తపల్లి మండలం మూలపేటలో 1999లో నిర్మించిన జగన్నాథుని ఆలయం సముద్ర అలల ఉద్ధృతితో ముప్పు అంచున ఉంది. పూరీ రథోత్సవం అనంతరం నిమజ్జనం చేసిన జగన్నాథ, బలభద్ర, సుభద్ర దారు విగ్రహాలు ఉప్పాడ తీరానికి చేరి మత్స్యకారుల వలలకు చిక్కినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయాన్ని సముద్ర కోత నుంచి కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు.