హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై దాడి..!

నెల్లూరు: మద్యం మత్తులో ఓ వ్యక్తి కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వెంకటేశ్వర్లు అనే ఆటో డ్రైవర్‌ను ఆటో వాహనం పక్కకు తీయాలని కోరాడు. దీంతో అతడు కానిస్టేబుల్‌పై దుర్భషలాడుతూ దాడి చేశాడు.