BPT: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ న్యాయవాది రావి సత్యనారాయణ భౌతికకాయానికి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యనారాయణ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. న్యాయవాదిగా సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయవాది సత్యనారాయణకు మాజీమంత్రి నివాళి


