హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

AKP: ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారిపై రాంపురం, పినగాడి జంక్షన్ మధ్య గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనరు‌ను వెనుక నుంచి ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో కంటైనర్ ముందు నీటి క్యాన్ కడుగుతున్న డ్రైవరు మీదకు లారీ దూసుకెళ్లడంతో కింద పడి మృతి చెందాడు. ఇసుక లారీ డ్రైవర్ గాయపడగా ఆసుపత్రికి తరలించారు.