హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలయం రచ్చుమర్రిలో తాగునీటి కష్టాలు

KRNL: మంత్రాలయం(M) రచ్చుమర్రిలో తాగునీటి కోసం కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కుళాయిలు ఉన్నప్పటికీ అరకొరగా నీరు రావడంతో వృద్ధులు ఎండలో నీటి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. రోజువారీ అవసరాలకు సరిపడా నీరు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కుళాయిలకు సక్రమంగా నీటి సరఫరా చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.