ASF: ఆదివాసీ యువతి శిరీష హత్యకు నిరసనగా తుడుందెబ్బ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొమురం భీం విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థులు, ఆదివాసీ సంఘాల నాయకులు ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, మహిళల రక్షణకు చట్టాలను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రతలపై భరోసా ఇవ్వలని కోరారు.
తెలంగాణ
'శిరీష హత్యకు నిరసనగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ'


