హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా మారిన మురుగు కాలువ బిళ్లలు!

SRPT: నేరేడుచర్ల పట్టణంలోని జాతీయ రహదారి వెంట పలు చోట్ల మురుగు కాలువపై ఉన్న కాంక్రీటు బిళ్లలు దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి. ఎస్‌బీఐ సమీపం, శివాలయం బైపాస్, మార్కెట్ యార్డు వైపు సమస్య తీవ్రంగా ఉంది. పెట్రోల్ బంక్ వద్ద కారు ఢీకొనడంతో డివైడర్‌ రెయిలింగ్, లైటింగ్ స్తంభం ధ్వంసమయ్యాయి. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.