హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాలకు పర్యావరణహిత ఏర్పాట్లు

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.మట్టి గణపతులను ప్రోత్సహించడంతో పాటు మండపాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, బారికేడ్లు, లైటింగ్, వైద్య సిబ్బంది, భద్రతా చర్యలు పటిష్టం చేయాలని సీపీ ఆదేశించారు.