సత్యసాయి: ముదిగుబ్బ మండలం పీసీ రేవులో దీర్ఘకాలిక తాగునీటి సమస్య తీరింది. ఎన్నికల హామీ మేరకు మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ మండల పరిషత్ నిధులు రూ.6.50 లక్షలు కేటాయించారు. నూతన బోరు, మోటారు, పైపులైన్ పనులు పూర్తి కాగా ఎంపీపీ ఆదినారాయణ నీటి సరఫరాను ప్రారంభించారు. హామీ నెరవేర్చిన మంత్రికి పీసీ రేవు గ్రామ ప్రజలు, కూటమి నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి హామీ నిలబెట్టుకున్న మంత్రి సత్యకుమార్


