నెల్లూరు: సంగం మండలం మక్తాపురం గ్రామంలో పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఆయన ఉపాధి శ్రామికులతో మాట్లాడారు. అనంతరం వారికి స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
సంగం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్


