హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నకిలీ పోలీసులపై మరో కేసు..!

KDP: నకిలీ పోలీసులుగా వ్యవహరిస్తున్న సాయినాథరెడ్డి, రవికుమార్‌రెడ్డిలపై ఇప్పటికే 13 కేసులు ఉన్నట్లు రూరల్‌ ఎస్సై రాజు తెలిపారు. మరో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి పోలీస్‌ లాఠీ, రూ.1,000 నగదు, రూ.1.30 లక్షల విలువైన ఐఫోన్‌, పల్సర్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాయి- 3, రవి- 10 కేసుల్లో ముద్దాయిలని తెలిపారు.