హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏటూరునాగారంలో కిరాణా దుకాణంలో చోరీ

MLG: ఏటూరునాగారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో మల్లికార్జున కిరాణా దుకాణంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి తాళంవేసి వెళ్లగా, బుధవారం ఉదయం తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. హ్యాండ్బాగులోని రూ.30 వేలు, కౌంటర్లోని రూ. 20 వేలు, 12లీటర్ల పెట్రోలు, ఇతరసరకులు అపహరణకు గురయ్యాయి. ఫిర్యాదుతో ఎస్సై బి. మహేష్ పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.