హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

నెల్లూరు: విడవలూరు మండలం వీరరెడ్డిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఉప్పాల వెంకటేశ్వర్లు తన వేరుశనగ పొలానికి స్ప్రింక్లర్ల ద్వారా నీరు పట్టే క్రమంలో విద్యుత్ తీగ తెగిపడింది. ప్రమాదవశాత్తు వైరు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.