హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

ELR: దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజనలో భాగంగా సీడాప్ ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు సోలార్ రూఫ్ టాప్ ఇన్స్‌స్టాలేషన్ సర్వీస్ విభాగాల్లో మూడు నెలలు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఫ్లాగ్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, 18 ఏళ్లు నిండిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 7లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.