హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరుపతి జిల్లాలో భారీ వర్షం

TPT: తిరుపతి(D) నాగలాపురం(M)లోని వినోబానగర్, కృష్ణాపురం, కాలంజేరి గ్రామాల్లో గురువారం వేకువజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వీధులు జలమయమయ్యాయి. పది రోజులుగా తీవ్ర ఎండతో అల్లాడిన ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరటనిచ్చింది. వాతావరణం చల్లబడటంతో బీడు భూముల్లో నీరు నిలిచింది.