హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన

JGL: రాయికల్ బస్టాండ్ ప్రాంతంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై సుధీర్‌రావు, ఏఎస్సై సైఫుద్దీన్ ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ మోసాల నివారణపై సూచనలు చేశారు. ఓటీపీ, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని, మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వహిస్తే మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.