హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె నిద్రలో పోలీసులు.. గ్రామాల్లో ప్రత్యేక నిఘా

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టారు. గ్రామాల్లో రాత్రి బస చేస్తూ మహిళల భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, దొంగతనాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.