హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బూతులతో పదవులు రావు: యార్లగడ్డ

NTR: రాజకీయాల్లో బూతులు తిడితే పదవులు వస్తాయనుకోవడం పొరపాటని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ‘రెండేళ్ల నమ్మకం’ కార్యక్రమంలో బుధవారం రాత్రి పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రామనగర్‌లో రూ.70 లక్షల సీసీ డ్రెయిన్‌కు శంకుస్థాపన చేశారు. గ్రామీణాభివృద్ధికి పవన్‌ కల్యాణ్‌ కృషి ప్రశంసనీయమన్నారు.