హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్, ప్రింటర్ బహూకరణ

కృష్ణా: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్, ప్రింటర్‌ను బహూకరించారు. సిద్ధినేని గోపి అందించిన కంప్యూటర్, ప్రింటర్‌ను అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు చేతుల మీదుగా పాఠశాల నిర్వాహకులకు అందజేశారు.