హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి వరకు సామాజిక పింఛన్ ల పంపిణీ గడువు పెంపు

VSP: సామాజిక పింఛన్‌ల పంపిణీ గడువును ఈ నెల 3 వరకు పొడిగించామని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్‌లో ఉన్నవి గురువారం పంపిణీ చేయాలని ఆదేశించారు. సెర్ప్ డైరెక్టర్ ఆదేశాల మేరకు గడువు పొడిగించామని పేర్కొన్నారు. కావున ఇంకా లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఈరోజు ఇళ్ల వద్దనే ఉండి పింఛన్లు అందుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.