హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి'

PLD: ఈపూరు గ్రంథాలయంలో అన్ని వయసుల వారికి అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని గ్రంథాలయాధికారి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. చిన్నారులకు నీతి కథలు, మహిళలకు వంటలు-కుట్ల పుస్తకాలు, యువతకు పోటీ పరీక్షల మెటీరియల్ ఉన్నాయని చెప్పారు. ఖాళీ సమయంలో సెల్‌ఫోన్లకు బానిసలు కాకుండా గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదవాలని కోరారు.