హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి వాడపల్లి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 4న ఉదయం శ్రీ వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు ఉట్లోత్సవ కార్యక్రమం జరగనుంది. భక్తులు భారీగా హాజరు కావాలన్నారు.