హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గేదెల కోసం వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి

KKD: యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాసంశెట్టి వెంకటరమణ (50) చెరువులో ఉన్న గేదెలను ఒడ్డుకు తీసుకురావడానికి నీటిలోకి దిగగా, ప్రమాదవశాత్తు కాలు జారీ మునిగిపోయాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.