హైదరాబాద్: 28°C
వ్యాపారం

తంగళ్లపల్లిలో వైఎస్‌ఆర్‌కు కాంగ్రెస్ నేతల ఘన నివాళి

SRCL: తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ CM దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగెల రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన పథకాలు చిరస్మరణీయమని అన్నారు.