హైదరాబాద్: 28°C
వ్యాపారం

10 వేల మందిపై ఒరాకిల్‌ వేటు?

అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటుకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో పని చేసే 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని సన్నద్ధమవుతోంది. దీని ప్రభావం భారత్‌లోని వందలాది మంది ఉద్యోగులపై కూడా పడే అవకాశం ఉంది. ఏఐ మౌలిక సదుపాయాలకు పెరుగుతున్న వ్యయాన్ని సమతుల్యం చేసుకునేందుకు, ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.