హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YSR గురించి అభిమాని భావోద్వేగ మాటలు

YSRతో ఉన్న అనుబంధాన్ని ఓ అభిమాని గుర్తు చేసుకున్నారు. '2009 సెప్టెంబర్‌ 2న స్కూల్‌కు సెలవు ప్రకటించడంతో సంతోషంగా ఇంటికి పరుగెత్తుకొచ్చాం. అయితే, ఇంటికి రాగానే ‘పెద్దాయన(YSR) ఇక లేరు’ అన్న విషాద వార్త తెలిసింది. మా గ్రామ ప్రజలంతా కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రం మొత్తం అలజడికి గురైంది. పెద్దాయనను ఎప్పటికీ మర్చిపోలేం' అంటూ భావోద్వేగంతో చెప్పారు.