హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మురడిలో చిరుత సంచారం కలకలం

ATP: డి.హీరేహాళ్‌ మండలం మురడి గ్రామ శివారు రైతు పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. ఉదయం పొలాలకు వెళుతున్న కూలీలకు చిరుత కనబడటంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు కెమెరాతో ట్రాప్‌ చేసి చిరుత కదలికలను గుర్తించి, కొండ గుట్టల్లోకి తరిమినట్లు డీఆర్‌వో దామోదర్‌రెడ్డి తెలిపారు.