హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్ జగన్‌ను కలిసిన పూల శ్రీనివాసరెడ్డి

సత్యసాయి: పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై శ్రీనివాసరెడ్డిని జగన్ అడిగి తెలుసుకున్నారు. స్థానిక రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించినట్లు నాయకులు తెలిపారు.