హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం'

PPM: శృంగవరపుకోటలోని కిల్తంపాలెం పీఎం శ్రీజవహర్ నవోదయ విద్యాలయంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభమైనట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ బి. కేశవప్రసాద్ తెలిపారు. 2027-28 లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్టు- 2027 ద్వారా 9, 11వ తరగతుల్లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2027 ఏప్రిల్ 10న పరీక్ష ఉంటుందని, అర్హులైనవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.