నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుడి ఇంట్లో పెళ్లి వేడుకకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి రవితేజ(17) డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు, స్థానికులు కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి


