హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆట పరికరాల సంరక్షణపై నిర్లక్ష్యం

NTR: విజయవాడ రాజీవ్‌ గాంధీ పార్కులో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఆట పరికరాలు పెద్దల వినియోగంతో దెబ్బతింటున్నాయి. ఆట స్థలంలో సెక్యూరిటీ, పార్కు సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పరికరాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటి సంరక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సందర్శకులు కోరుతున్నారు.