ELR: దెందులూరు మండలానికి చెందిన పసల దుర్గారావు (36) గుండుగొలను సెంటర్ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతదేహం ఛిద్రమైంది. దెందులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర ప్రమాదం.. మృతదేహం ఛిద్రం!


