అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో జరిగిన నీటిపారుదల జలమండలి సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. శింగనమల నియోజకవర్గంలోని రైతుల సాగు, తాగునీటి అవసరాలపై ప్రస్తావించారు. ముఖ్యంగా చీని, అరటి వంటి ఉద్యాన పంటలు ఎక్కువగా సాగవుతున్నాయని.. ఇబ్బందులు తలెత్తకుండా నీరు అందించాలని ఆమె కోరారు. తుంగభద్ర కాలువ నుంచి 8 TMCల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
జలమండలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే


