హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం జనసేనలో వర్గపోరు

కృష్ణా: మచిలీపట్నం జనసేనలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. మేయర్ పదవి కోసం రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బలప్రదర్శనకు వేదికగా మార్చేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ, సీనియర్ నేత కొట్టె వెంకట్రావ్ వేర్వేరుగా రూట్ మ్యాప్‌లు సిద్ధం చేసుకుని ఇవాళ బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.