హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెల రోజుల పాటు జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

నారాయణపేట జిల్లాలో ఈనెల 30 వరకు నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు, యువజన, రైతు, కార్మిక సంఘాలు నిరసనలు, భారీ బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.