హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీపీఎస్‌ రద్దు.. ఓపీఎస్‌ అమలు చేయాలి'

NGKL: నాగర్‌కర్నూల్ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఐడీఓసీ కార్యాలయం ఎదుట పెన్షన్ విద్రోహ దినం నిర్వహించారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని, రెండో పీఆర్సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను విడుదల చేసి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.