KRNL: పెద్దకడబూరు మం. దొడ్డిమేకల శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నట్లు SIమారుతి తెలిపారు. రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేయగా కొందరు పరారయ్యారని, వడ్డే నగేశ్‌తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 8,150 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై పోలీసుల దాడి: ఎస్సై


