CTR: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ మంగళవారం జిల్లా వ్యాప్తంగా 93.76 శాతం జరిగినట్లు డీఆర్డీవో పీడీ శ్రీదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,30,607 మందికి గాను తొలి రోజున 2,16,219 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేశారు. మిగిలిన 14,388 మంది లబ్ధిదారులకు ఇవాళ ఇవ్వనున్నట్లు పీడీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కొనసాగనున్న పింఛన్ల పంపిణీ


