హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

CTR: చిత్తూరులో రోడ్డు పనుల నిమిత్తం పలు ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో డీఈ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. సీఆర్ మిట్ట, సీకేపల్లె, రఘురామ నగర్ కాలనీ, మైదా ఫ్యాక్టరీ రోడ్డు, సాంబయ్య కండ్రిగ, శ్రీనగర్ కాలనీల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.