హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయ పనులను పరిశీలించిన ఛైర్మన్

WG: నరసాపురంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రేడ్-1 డిజిటల్ గ్రంథాలయ భవన నిర్మాణ పనులను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తుగ నాగరాజు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భవన నిర్మాణ ప్రగతిని, నాణ్యతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు, కాంట్రాక్టరుకు పలు సూచనలు చేశారు.