హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

KKD: తొండంగి మండలం వాకదారిపేట వద్ద మంగళవారం జరిగిన ఆటో ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో మంచాల అప్పల నరస (45) అక్కడికక్కడే మృతి చెందారు. లావేటి వెంకటలక్ష్మి (48), బొట్ట నూకరత్నం (37),నాగమణి (52) తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న సింహాచలం (75)ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.