హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ డిపోలో పలు బస్సులు రద్దు

KKD: పాయకరావుపేటలో ఇవాళ ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో కాకినాడ ఏపీఎస్ఆర్టీసీ డిపో పరిధిలో 45 బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సభకు బస్సులను కేటాయిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేపట్టి, సహకరించాలని కోరారు.