హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు కళ్యాణ మండపాలకు ఆదేశాలు

GNTR: గుంటూరులో రోజుకు 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసే కళ్యాణ మండపాలు, సంస్థలు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్–2026 నిబంధనలు తప్పక పాటించాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సురేశ్ ఆదేశించారు. చెత్తను నాలుగు రకాలుగా వేరుచేసి, తడి వ్యర్థాలను తమ ప్రాంగణాల్లోనే శాస్త్రీయంగా ప్రాసెస్ చేయాలన్నారు. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని యజమానులను హెచ్చరించారు.