హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలేరమ్మ తల్లి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.

BPT: చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొత్తపాలెం గ్రామంలో నిర్వహించిన శ్రీ పోలేరమ్మ తల్లి సంబరాల మహోత్సవంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపాకటాక్షాలతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించినట్లు తెలిపారు.