KNR: కరీంనగర్ రూరల్ ఐసీడీఎస్ పరిధిలో అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎల్‌ఎండీ కాలనీలోని మహిళా ప్రాంగణంలో అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను మంగళవారం పరిశీలించారు. సీడీపీఓ శ్రీలత ఆధ్వర్యంలో జరిగిన వెరిఫికేషన్‌కు మానకొండూరు, చిగురుమామిడి మండలాల నుంచి 193 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
తెలంగాణ
అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి వెరిఫికేషన్


