AKP: సీఎం చంద్రబాబు బుధవారం పాయకరావుపేటలో పాల్గొనే జలహారతి కార్యక్రమం నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జలహారతి ప్రాంగణం, సభా వేదిక, హెలిప్యాడ్, వీఐపీ కాన్వాయ్ మార్గాలను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. బందోబస్తు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి'


