హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్లో భోజనం చేసిన మంత్రి

ప్రకాశం: సింగరాయకొండలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి స్వామి పాల్గొన్నారు. ఆయన సాధారణ ప్రజలతో కలిసి అన్న కాంటీన్లో పంక్తిలో కూర్చుని భోజనం చేశారు. క్యాంటీన్లో అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించిందని మంత్రి పేర్కొన్నారు.