ASR: ముంచంగిపుట్టు (M) పనసపుట్టు పంచాయతీ గిద్దులపుట్టు గ్రామంలో ముంచంగిపుట్టు ఎస్సై పీ.నాని ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రత, మహిళల రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలన, పోక్సో చట్టంపై ప్రజలకు వివరించారు. రాత్రి దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సైబర్, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సై ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం


